BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Select Suryaa Now
జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్ :కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తొలిస్థానంలో నిలిచి జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నగర పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు మరియు సిబ్బంది సమష్టి కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త ఉచిత సేకరణ, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి మరియు ప్రజల భాగస్వామ్యం ఆధారంగా జీహెచ్‌ఎంసీకి ఈ గుర్తింపు లభించింది. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా, నెట్‌జీరో సిటీగా మార్చే లక్ష్యంలో ఈ పురస్కారం ఒక కీలక మైలురాయి అని, ఇది పర్యావరణహిత పద్ధతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని సీఎం పేర్కొన్నారు.