దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం.
- మండల తెలుగు యువత అధ్యక్షుడు చందక నర్సింగరావు.
అనకాపల్లి, నవంబర్ 11, మేజర్ న్యూస్: మండలంలోని సుందరయ్యపేట గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మండల తెలుగు యువత అధ్యక్షులు చందక నర్సింగరావు రూ.50,000 విరాళంగా ప్రకటించారు. సోమవారం గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు, నూతన గెలుపొందిన ఎంపీటీసీ బుద్ద శంకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా బుద్ద శంకర్ మాట్లాడుతూ మండల పరిషత్ నిధులు విడుదలైన వెంటనే మొదటగా గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ బాధపు తాతారావు ధనలక్ష్మి, గ్రామ పెద్ద బాధపు అప్పారావు, కుండల దేముడు, బాధపు చిమ్మన్న నాయుడు, వియ్యపు అప్పల నాయుడు, బోయిన రమణ తదితరులు పాల్గొన్నారు.