మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన
అనకాపల్లి, నవంబర్ 11, మేజర్ న్యూస్: విశాఖ జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణికి 107వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి నీలబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. విశాఖలోని మేయర్ స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా నీలబాబు మాట్లాడుతూ గత పాలకవర్గంలో కలిసి పనిచేశామని, ఇప్పుడు మేయర్‌గా ఎన్నికవడం ఆనందంగా ఉందని తెలిపారు. తమ వార్డును సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. గత పాలకవర్గంలో 50 కోట్లతో 84వ వార్డులో అభివృద్ధి పనులు చేశామని, తమ వార్డు అభివృద్ధికి కూడా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు