BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

Select Suryaa Now
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

గీసుగొండ, మేజర్ న్యూస్, మండలంలోని   బొడ్డుచింతలపల్లి గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని జిల్లా పశుగణాభివృద్ధి కార్య నిర్వాహణాధికారి డాక్టర్ జి. సంపత్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ఎదుర్కోవాలంటే రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని,ఆడ దూడలు కావాలనుకునే పాడి రైతులు గేదెలకు లింగ నిర్ధారణతో గర్భాధారణతో కృత్రిమ గర్భధారణతో సాధ్యపడుతుందని అన్నారు.స్ధానిక పశువైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..పాడి రైతులు గోపాలమిత్ర సేవలను వినియోగించుకోవాలని,లింగ నిర్ధారణ వీర్యం అందుబాటులో ఉందని,దీని ద్వారా ఆడ దూడలు మాత్రమే పుడతాయని, దీనిని రైతు సోదరులు వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ శిబిరానికి వచ్చిన పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ శిబిరంలో 36 ఎదకురాని పాడి పశువులకు వాక్సిన్ వేయడంతో పాటు,31దూడలకు నట్టల నివారణ మందులు అందించామని,
2 గేదెలకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు,గర్భకోశ వ్యాధులకు చికిత్సలు,చూడి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోగుల వనితా యుగంధర్,జూనియర్ వెటర్నరీ డాక్టర్ హేమలత, ఉమా,రమేష్,  గోపాలమిత్ర సూపర్వైజర్ ఎండి జహంగీర్, గోపాలమిత్రులు బండి సుధీర్,తుప్పరి అనిల్ కుమార్,అక్బర్, ఇంటాస్ కంపెనీ ప్రతినిధులు అజయ్, డి. శ్రీధర్,పాడి రైతులు పాల్గొన్నారు.

రిపోర్టర్: విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా