BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

పరకాల, మేజర్ న్యూస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను బుధవారం పరకాల బ్రాంచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పి. సాయి కార్తీక్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారస్తులు  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.1919 నవంబర్ 11న ముంబైలో స్థాపించబడిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. శతాబ్దానికి పైగా దేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తూ, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.రైతులు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, మహిళలకు వివిధ రకాల ఆర్థిక సేవలు అందించడంతో పాటు ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఖాతాదారులకు మరింత చేరువవుతోంది. ప్రజల విశ్వాసమే బ్యాంకు విజయ ప్రస్థానానికి ప్రధాన బలమని ఈ సందర్భంగా సిబ్బంది పేర్కొన్నారు.
కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పి. సాయి కార్తీక్, బ్యాంకు ఉద్యోగులు పి. హెలెన్ హిల్లరీ, పి. వినయ్ కుమార్, పుష్ప, రాకేష్, బ్రహ్మచారి, కళ్యాణ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సుజాత, పరకాల ,హనుమకొండ జిల్లా