సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం
గీసుగొండ, మేజర్ న్యూస్, పోలీస్ జట్టు కెప్టెన్ సీఐ విశ్వేశ్వర్ 47 బంతుల్లో 90 పరుగులు చేసి విశ్వరూపం చూపారు.త్వరలో జరగనున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌కు సన్నాహకంగా,ఏడు పోలీస్ బెటాలియన్ల క్రీడాకారులతో కూడిన రేంజ్–1 పోలీస్ జట్టుతో వరంగల్ పోలీస్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.ఈ మ్యాచ్‌లో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్ విశ్వేశ్వర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు.కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు,10 భారీ సిక్సర్లతో అజేయమైన దూకుడు ప్రదర్శిస్తూ 90 పరుగులు సాధించారు.ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానాన్ని బౌండరీల మోతతో హోరెత్తించారు.
అద్భుతమైన బ్యాటింగ్‌తో బెస్ట్ బ్యాటర్‌గా నిలిచి,8.95 ఎంవిపి రేటింగ్ సాధించిన విశ్వేశ్వర్ తన సత్తా చాటారు.ఆయన మెరుపు ఇన్నింగ్స్ వరంగల్ పోలీస్ జట్టులో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు రాబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
రిపోర్టర్ :విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా