అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ.
'పోషణ్ భీ పఢాయీ భీ’ శిక్షణలో పాల్గొన్న సీడీపీఓ శశికళ.
కశింకోట(అనకాపల్లి), నవంబర్ 11, మేజర్ న్యూస్: అనకాపల్లి ప్రాజెక్టు పరిధిలోని కశింకోట మండలంలో తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న ‘పోషణ్ భీ పఢాయీ భీ’ రెండో విడత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సీడీపీఓ శశికళ మాట్లాడుతూ
ఈ శిక్షణలో భాగంగా పోషణ్ భీ పఢాయీ భీ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా అమలు చేయడం, ఆచరణాత్మక బోధనా పద్ధతులు, కీలక అంశాలపై క్షేత్రస్థాయి సందర్శనలు, పిల్లల అభివృద్ధి పర్యవేక్షణ, దివ్యాంగులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో భాగస్వాములను చేయడం, రిఫరల్ వ్యవస్థ, పోషకాహార నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన లభిస్తుందన్నారు.
చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పోషకాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడం, అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని శశికళ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఝాన్సీ, సునీతతో పాటు కశింకోట మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.