ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు
అరకులోయ, నవంబర్ 11, మేజర్ న్యూస్:మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీకి చెందిన శరభగుడ సిబిఎం చర్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి,విజయనగరం వి డెంటల్ సహకారంతో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేక ఉచిత వైద్య శిబిరంలో 236 మందికి నేత్ర,దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21 మందికి కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు ధృవీకరించారు. కంటి,దంత రోగాలతో బాధపడుతున్న వారిలో అవసరమైన కొంతమందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈవైద్య శిబిరంలో పెన్షన్ దారుల సంఘం ప్రతినిధులు వోలేసి. బాబురావు,బురిడి. ఆనందరావు,నప్రీ. రామారావు,మొర్ధోన్. సుబ్బారావు, ఆదివాసీ పరిరక్షణ సమితి అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు చట్టు.మోహన్, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి మేనేజర్ ఎం.చంద్రశేఖర్, వైద్యులు అన్న బి జోసెఫ్,జానీ చార్లెస్ జాక్సన్,వి డెంటల్ వైద్యులు పృథ్వీ,తన్మయి,గోపిక, పాల్గొన్నారు.