BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

మేజర్ పంచాయితీ మనదే కావాలి...

Select Suryaa Now
మేజర్ పంచాయితీ  మనదే కావాలి...


- మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్..

నరసన్నపేట నవంబర్ 11 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ పంచాయతీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పొట్నూరు వాణి,  గెలుపుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ నరసన్నపేట వైఎస్ఆర్సిపి నాయకులకు  సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని ముఖ్య నాయకులతో బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ముఖ్యంగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మేజర్ పంచాయతీ పరిధిలోని ముఖ్య నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.