బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
పాలకుర్తి , మేజర్ న్యూస్, మండలం లోని శాతా పురం గ్రామానికి చెందిన, 4 కాంగ్రెస్ కుటుంబాలు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి ఆధ్వ ర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో బుధవారం చేరారు. వారికీ గులాబీ కండు వాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాట్లాడుతూ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, కెసిఆర్ సీఎం కావడం ఖాయ మని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు పాము శ్రీనివాస్, ఎఫ్ ఎస్ సి ఎస్ బ్యాంకు చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ఏలూరి కృష్ణమూర్తి ఆనగంటి సోమ నరసయ్య, చిలువేరు పెంటయ్య, గన్న కృష్ణమూర్తి, వేల్పుల అనిల్, నాయిని నర్సిరెడ్డి, ఐలేని యాకం రెడ్డి, బీరెల్లి రవివర్మ, పసులాది పోశయ్య, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సోమయ్య, పాలకుర్తి ,జనగామ జిల్లా