BREAKING
దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్

Select Suryaa Now
బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్

ఆత్మకూరు, మేజర్ న్యూస్, ఆత్మకూరు మండలం లింగమడుగు పల్లి గ్రామ ఉపసర్పంచ్  సుకినె మంచుకి-విజయ్  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చని బిజెపి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు  కొలను సంతోష్ రెడ్డి  సమక్షంలో, పరకాల నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్,జిల్లా కౌన్సిల్ మెంబర్ గట్టు వేణు ఆధ్వర్యంలో  విజయ్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో, నాయకుల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని అన్నారు. నేడు జరిగిన చేరిక అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మరిన్ని చేరికలు జరుగుతాయని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్  మాట్లాడుతూ విజయ్  బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు బిజెపి మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ఆర్టిఐ యాక్ట్ జిల్లా కన్వీనర్ ఏదులాపురం శ్రావణ్ కుమార్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి యువ మోర్చా మండల అధ్యక్షులు నరేష్ జిల్లా నాయకులు మామునూరు శ్రీనివాస్ వజ్ర రవికుమార్ ముద్దేర గోపాల్ ఊగ సాయి కృష్ణ లకిడే నాగరాజు మాదిరెడ్డి సురేందర్ బలబద్ర దినేష్ సుకినె నితిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్ ,శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా