BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

Select Suryaa Now
బోరవానిపేటలో  కేంద్ర బృందం పర్యటన  ఏర్పాట్లులను  పరిశీలన


 
బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుపై  గురువారం కేంద్ర బృందం పర్యటన

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్


శ్రీకాకుళం/గార , నవంబర్ 11 మేజర్ న్యూస్: గురువారం  బోరవానిపేటలో  బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుపై   కేంద్ర బృందం  పర్యటన ఏర్పాట్లులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం పరిశీలించారు.

       జాతీయ స్థాయిలో బాలహిత గ్రామ పురస్కారం (Child Friendly Village) కోసం నామినేట్ అయిన  గార మండలం బోరవానిపేట గ్రామాన్ని  గురువారం  కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం సందర్శించనున్న నేపథ్యంలో   మండల ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో కేంద్ర బృందం పరిశీలన కోసం ఏర్పాటు చేస్తున్న వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లు, పాఠశాల మౌలిక వసతులు, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆరాదీశారు. బాలల హక్కుల పరిరక్షణ, సంపూర్ణ విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహార భద్రత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాల్లో గ్రామ పంచాయతీ సాధించిన ప్రగతిని కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా గ్రామంలో వంద శాతం బాలల పాఠశాల నమోదు, బడి మానివేతల నివారణ, సంపూర్ణ టీకాలు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిరోధం వంటి అంశాలకు సంబంధించిన రికార్డులు, గణాంకాలు, సాధించిన ఫలితాలను కేంద్ర బృందానికి స్పష్టంగా వివరించేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు.అలాగే మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పోషకాహార మెనూ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం, విద్యార్థులు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించే కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

       ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషిత్ ముఖ్య నిర్వహణాధికారి  ఆర్. వెంకటరామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి, జిల్లా పరిషిత్ డిప్యూటీ సీఈఓ కె.సౌమ్య, డివిజన్ పంచాయితీ అధికారి ఆర్. గోపిబాల, స్థానిక తహసీల్దార్ యం చక్రవర్తి, యంపిడిఓ శ్రీనివాస రావు,  పశు సంవర్ధన శాఖ అసిస్టెంట్  డైరెక్టర్ పి ఎస్ జి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.