BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Select Suryaa Now
విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

ఆత్మకూరు , మేజర్ న్యూస్, పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తా అని ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి మండల పరిధిలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో మంచినీటి సరఫరా, విభి-జీ రామ్ జి పథకం, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సస్పెండ్ ఆర్డర్ ఇస్తాను అని నిర్మోమాటంగా అధికారులను  హెచ్చరించారు.గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందేలా చూడాలని కోరారు.ప్రతి గ్రామంలో తాగునీటి వనరులను పరిరక్షించాలని, బావుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో భూగర్భ జలమట్టాన్ని తప్పనిసరిగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా అవగాహన కల్పించి, పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు.నీటిని వృథా చేసే వారిపై ఫిర్యాదులు అందినట్లయితే విచారణ జరిపి రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మంచినీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల జీవనాధారం వంటి సున్నితమైన అంశాలపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం సరికాదని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.భూగర్భ జలాల సంరక్షణ, నీటి పొదుపు, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి బావులు బోర్లు నీటి కుంటలు చెరువులు చెక్ డ్యాములు గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.వీబీజీ రాంజీ పథకంలో రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరినీ చేర్పించాలన్నారు. ప్రతి గ్రామంలో అధిక సంఖ్యలో ఉపాధి పనుల్లో కూలీలను పెంచాలని, అలాంటి వారికి ప్రోత్సాహకం అందుతుందని, కార్యదర్శులు, సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
విద్యుత్ వినియోగం తగ్గించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రిడ్ డీఈ , మిషన్ భగీరథ డీఈ  , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో యోగిత, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ కుమార్, మండల వైద్యాధికారి డా .కె .స్పందన, ఏపీవో రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా