వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జీవో నెం.15ను అమలు చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య - పెద్దపల్లి : జిల్లాలో వీధి కుక్కల దాడుల నివారణకు, వాటి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పశువైద్య శాఖ సమన్వయంతో అవసరమైన సిబ్బంది, వనరులను సమకూర్చుకొని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, డీపీఓ శ్రీమాల, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.