BREAKING
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం

పారదర్శకంగా గుణంకాల నమోదు పాటించాలి -నోడల్ అధికారుల అవగాహనలో ఆప్సి చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు

Select Suryaa Now
పారదర్శకంగా గుణంకాల నమోదు పాటించాలి  -నోడల్ అధికారుల అవగాహనలో ఆప్సి చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఉన్నత విద్యా గణాంకాల నమోదులో పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం సహకారంతో ప్రాంతీయ ఏఐఎస్‌హెచ్‌ఈ వర్క్‌షాప్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన గణాంకాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి విద్యాసంస్థ తమ వివరాలను పూర్తి అవగాహనతో పారదర్శకంగా వాస్తవ గణాంకాలతో సమర్పించాలని సూచించారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ఉన్నత విద్యా రంగం ప్రగతిని ప్రతిబింబించేలా సమాచారాన్ని నమోదు చేయాల్సిన బాధ్యత ప్రతి నోడల్ అధికారిపై ఉందన్నారు. ఈ డేటా నమోదు ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యాసంస్థల ప్రగతికి, విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన ప్రయోజనాలను సాధించడం సులభతరం అవుతుందని తెలియజేశారు. జాతీయ స్థాయిలోగణాంకాల ప్రాధాన్యతపై అవగాహన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి ఆచార్య కె.గంగాధర రావు జాతీయ స్థాయిలో ఏఐఎస్‌హెచ్‌ఈ గణాంకాల నమోదు, సమర్పణ పరిస్థితులను వివరించారు. మండలి వైస్ ఛైర్‌పర్సన్, రాష్ట్ర ఏఐఎస్‌హెచ్‌ఈ నోడల్ అధికారి ప్రొఫెసర్ కె. రత్న శీలామణి మాట్లాడుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీలోని ఏఐఎస్‌హెచ్‌ఈ విభాగం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా గణాంకాల నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒక రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించామని, వివిధ ప్రాంతాల్లో మరో 10 నుంచి 12 ప్రాంతీయ వర్క్‌షాప్‌లతో పాటు రాష్ట్రంలోని సుమారు 26 విశ్వవిద్యాలయాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.తిరుపతి రావు మాట్లాడుతూ గణాంకాల సమర్పణలో ఖచ్చితత్వం, ప్రామాణికత తప్పనిసరని, తప్పుడు సమాచారం జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ డేటా నమోదుపై ప్రాక్టికల్ శిక్షణ

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఎం.త్రిమూర్తి రావు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ బి. మునిస్వామి, ఏఐఎస్‌హెచ్‌ఈ న్యూఢిల్లీకి చెందిన ప్రోగ్రామర్ శివం పాండే పాల్గొన్నారు. అనుబంధ కళాశాలలు సమర్పించే ఖచ్చితమైన గణాంకాలు వాటి అనుబంధ గుర్తింపు, ప్రవేశాల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ ఎం.త్రిమూర్తి రావు వివరించారు. ప్రొఫెసర్ బి.మునిస్వామి వివిధ డేటా సేకరణ విధానాలు, ఉపాధ్యాయుల సమాచార ఫైళ్లపై వివరించి, పాల్గొన్న వారి సందేహాలను నివృత్తి చేశారు. శివం పాండే ఆన్‌లైన్ ద్వారా ఏఐఎస్‌హెచ్‌ఈ వివరాలను నమోదు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నోడల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్