BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టిన 3D ప్రాజెక్టుల ప్రదర్శన

Select Suryaa Now
విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టిన 3D ప్రాజెక్టుల ప్రదర్శన

 

సూర్య – పెద్దపల్లి రూరల్ :

మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫార్మనోవా – అనాటమీ 3D ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్’ ఆకట్టుకుంది. నవంబర్ 10న కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన వివిధ అవయవాల 3D నమూనాలను రూపొందించి ప్రదర్శించారు.
గుండె, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ తదితర అవయవాల నమూనాలను సృజనాత్మకంగా రూపొందించడంతోపాటు వాటి పనితీరును వివరించారు. విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతను కళాశాల డైరెక్టర్ నవత, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శ్రీనివాస్, పవన్, విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.
ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశోధనా దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు పుస్తక జ్ఞానాన్ని ఆచరణలో చూపేందుకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ‘ఎక్స్‌ప్లోర్ – లెర్న్ – ఎక్స్‌పీరియన్స్’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమ విజయానికి సహకరించిన యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.