BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

Select Suryaa Now
నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

                 మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
                               చేతులెత్తే పద్ధతిలోనే ఓటింగ్.. పార్టీ విప్ ధిక్కరిస్తే సభ్యత్వం రద్దు

పెరవలి మేజర్ న్యూస్ :ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరోక్ష ఎన్నికల ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నవంబర్ 14వ తేదీలోగా సభ్యులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. నవంబర్ 19వ తేదీన జరిగే ఎన్నికల రోజు ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనుండగా, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను చేతులెత్తే పద్ధతి ద్వారా నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు ఆయా పార్టీల విప్‌కు లోబడి ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన సభ్యులపై సభ్యత్వ రద్దు వేటు పడే అవకాశం ఉంది. అయితే కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ నిబంధన వర్తించదు అన్నారు. ముందుగా అధ్యక్ష లేదా చైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ఉపాధ్యక్ష లేదా వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది అని పెరవలి మండల ప్రత్యేక అధికారి, రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్ తెలియజేశారు.