BREAKING
ఐపీఎల్ 2027: అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మ ట్రేడింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్! సంక్రాంతి బరిలో కాకా వర్సెస్ విశ్వంభర క్లాష్.. ఓటీటీ డెడ్‌లైన్ టెన్షన్స్‌లో మెగా మూవీ! జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై క్లారిటీ.. ఆ వార్తల్లో నిజమెంత? కుటుంబంతో కలిసి అట్టహాసంగా దిల్ రాజు దీపావళి వేడుకలు.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు! ఆస్కార్ రేసులోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. అకాడమీ అవార్డుల పరిశీలనకు పంపిన మేకర్స్! అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం ప్రశ్నించే గొంతును కట్టడిచేస్తే ప్రతిఘటిస్తాం -కూటమి ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ నేతల హెచ్చరిక అభిమాని కామెంట్‌కు నటి సునైనా ఊహించని రిప్లై.. నెట్టింట వైరల్ అవుతున్న కౌంటర్! మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? పారదర్శకంగా గుణంకాల నమోదు పాటించాలి -నోడల్ అధికారుల అవగాహనలో ఆప్సి చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న దిశా పటాని.. వైట్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్! 20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు ప్రజాక్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమే - జడ్పీటీసీ వాసంశెట్టి నాగేశ్వరరావు. అండగా ఉంటామని భరోసా. అంతరాబ, అచ్చుతాపురంలో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

Select Suryaa Now
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి  - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

 

సూర్య - పెద్దపల్లి: జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో ఐసిడిఎస్ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి గర్భిణి, బాలింతను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసి ప్రభుత్వ పోషకాహారాన్ని సక్రమంగా అందించాలన్నారు. చిన్నారుల బరువు, ఎత్తును క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పోషకాహార లోపం ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణాలను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, ప్రీ-స్కూల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఐసిడిఎస్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో సీడీపీఓలు అనిత, అలేఖ్య, సంపదకుమారి, పుష్పలత, సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.