ప్రజాక్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమే - జడ్పీటీసీ వాసంశెట్టి నాగేశ్వరరావు. అండగా ఉంటామని భరోసా.
అనపర్తి మేజర్ న్యూస్ :అనపర్తి మండలం కుతుకులూరు ఎంపీటీసీ–2 స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన తాపేశ్వరపు వెంకన్నబాబును జడ్పీటీసీ వాసంశెట్టి నాగేశ్వరరావు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వెంకన్నబాబుకు మద్దతు తెలిపారు.