పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
మరిపెడ, మేజర్ న్యూస్, రేషన్ కార్డు కలగి ఉంటే ప్రతి ప్రభుత్వ సంక్షేమ పధకానికి అర్హత కలగి ఉంటామని, రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఎక్కడైనా సన్న బియ్యం పొందవచ్చని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,గృహాలకు ఉచిత విద్యుత్‌తో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండు లక్షలకు పైగా రేషన్ కార్డులను అర్హులకు అందించిందని తెలిపారు.ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటించిన ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్లి రఘువీర రెడ్డి,మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, పట్టణ అధ్యక్షులు రాంలాల్, నాయకులు కుడితి నరసింహారెడ్డి అఫ్జల్, గంధసిరి అంబరీష,అలవాలా ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి బిక్షపతి, తాజుద్దీన్, రవికాంత్, అనంతగిరి శ్రీను, వార్డు కౌన్సిలర్లు నీలాలచ్చి రామ్ నాయక్,జాటోత్ సురేష్ నాయక్, తిరుపతి నాయక్, జియో రమేష్, కాంతమ్మ, కరణ్ సింగ్, వార్డు అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు గుండాగాని వెంకన్న, అజిజ్,రేషన్ డీలర్లు రాము నాయక్, సింగనబోయిన నరసింహారావు, వెంకన్న నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చంద్రశేఖర్ ,మరిపెడ, మహబూబాద్ జిల్లా