BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు

Select Suryaa Now
మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు

 

మెలియాపుట్టి. నవంబర్ 10. మేజర్ న్యూస్....
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మెలియాపుట్టి మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించేందుకు పది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పి. నరసింహప్రసాద్ మంగళవారం  తెలిపారు. గ్రామాల వారీగా కేంద్రాలను కేటాయించారు.

* గొప్పిలి జెడ్పీ హైస్కూల్: గొప్పిలి, గోకర్ణపురం, సంతలక్ష్మీపురం.

* కరజాడ జెడ్పీ హైస్కూల్: కరజాడ, భరణికోట, మర్రిపాడు-కె, ఎస్. కొలిగాం, ముక్తాపురం.

* జాడుపల్లి గ్రామ సచివాలయం: జాడుపల్లి, చీపురుపల్లి, పరశురాంపురం, బాణాపురం.

* చాపర జెడ్పీ హైస్కూల్: మారడికోట, చాపర, జోడూరు, పట్టుపురం.

* పెద్దలక్ష్మీపురం జెడ్పీ హైస్కూల్: పెద్దలక్ష్మీపురం, శేఖరాపురం, గంగరాజుపురం.

* కోసమాల జెడ్పీ హైస్కూల్: కోసమాల, వసుంధర, నడసంద్ర, రట్టిని.

* మర్రిపాడు-సి ఎంపీపీ స్కూల్: మర్రిపాడు-సి, దీనబంధుపురం, కొత్తూరు, వెంకటాపురం.

* పెద్దపద్మాపురం జెడ్పీ హైస్కూల్: పెద్దపద్మాపురం, పడ్డ, ముకుందాపురం.

* కేరాసింగి జీఏటీడబ్ల్యూయూపీ స్కూల్: కేరాసింగి, ఆంపురం, గొట్టిపల్లి, ఇల్లాయిపురం.

* మెలియాపుట్టి ఎంపీపీ స్కూల్: మెలియాపుట్టి, సిరియాఖండి, సుందరాడ.

ఈ పది కేంద్రాలకు అధికారులను నియమించామని, వారి ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎంపీడీవో వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.