BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు

Select Suryaa Now
20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు

 

సంతబొమ్మాళి, నవంబర్ 10, మేజర్ న్యూస్ :

సంతబొమ్మాళి మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మరోసారి స్పష్టమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలనూ కైవసం చేసుకున్న టీడీపీ బలపరిచిన అభ్యర్థులు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. గోపికృష్ణ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులపై ఘనవిజయం సాధించి అన్ని స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేశారు. ఈ విజయంతో మండల పరిషత్‌పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలిపారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సంతబొమ్మాళి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నూతన ఎంపీటీసీ సభ్యులంతా సమష్టిగా కృషి చేస్తారని స్పష్టం చేశారు.
20 స్థానాలు ఏకపక్ష విజయం అభివృద్ధే లక్ష్యంగా నూతన ఎంపీటీసీల అడుగులు పడుతుండటంతో మండల రాజకీయాల్లో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.