BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

ప్రశ్నించే గొంతును కట్టడిచేస్తే ప్రతిఘటిస్తాం -కూటమి ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ నేతల హెచ్చరిక

Select Suryaa Now
ప్రశ్నించే గొంతును కట్టడిచేస్తే ప్రతిఘటిస్తాం -కూటమి ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ నేతల హెచ్చరిక

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో సమస్యలపై ప్రశ్నించే గొంతులను కట్టడి చేసే ప్రయత్నం చేయడం దారుణమని అలాంటి చర్యలు చేపడితే ప్రతిఘటిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. మంగళవారం ఎస్వీయూ ప్రధాన ద్వారం ఎదుట వారు ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులకు క్రమశిక్షణా రాహిత్య నోటీసులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఎస్ఎఫ్ఐ నాయకులను ఇలాంటి నోటీసులతో బెదిరించలేరని అన్నారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడి ప్రధానమంత్రిని సైతం ప్రశ్నించిన చరిత్ర ఎస్ఎఫ్ఐకు ఉందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు విరుద్ధంగా జరిగే ఇటువంటి చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలను అనుమతించకూడదనే విధంగా ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులకు క్రమశిక్షణా రాహిత్యం పేరుతో యూనివర్సిటీ అధికారులు నోటీసులు జారీ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, వినోద్, యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు అనిత, నరసన్న, నాయకులు తిప్పేస్వామి, ప్రవీణ్, వర్షిణి, దీపిక, ప్రేమ్, చరణ్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్