14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఈనెల 14 నుంచి 17 వరకు తిరుపతి వేదికగా అండర్-13 బాలబాలికల విభాగంలో యోనెక్స్–సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడును మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. చిన్న వయస్సు నుంచే క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహం, శిక్షణ, పోటీ వాతావరణాన్ని కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రవి నాయుడు తెలిపారు. ముఖ్యంగా తిరుపతిని ఒక ప్రధాన క్రీడా హబ్‌గా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతి వేదికగా నిలవడం ద్వారా స్థానిక క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని, క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని శాప్ చైర్మన్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు శివయ్య మునుస్వామి ఉన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్