BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.

Select Suryaa Now
మూలపేట  పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.


-నిర్ణీత గడువులోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలి.
-రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ 
సంతబొమ్మాళి, నవంబర్ 10,మేజర్ న్యూస్ :
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని  రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారులని ఆదేశించారు. మండలంలోని నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు పనులను జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఆయన పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.ఈ సందర్భంగా బ్రేక్ వాటర్, రిక్లమేషన్ పనులు, మూడు జనరల్ కార్గో బెర్తులు, ఒక కోల్ బెర్తు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆయా పనులు సుమారు 82 శాతం పూర్తయ్యాయని, ఆన్‌షోర్ సదుపాయాలు, బాహ్య మౌలిక వసతుల పనుల వివరాలను విశ్వసముద్ర కంపెనీ చైర్మన్ సీహెచ్ శశిధర్ రావు మ్యాప్ ద్వారా వివరించారు. మొత్తంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు 93 శాతం వరకు పూర్తయ్యాయని పోర్టు అధికారులు తెలిపారు. అనంతరం పోర్టు నిర్మాణ పనుల వేగవంతంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టుకు అనుసంధానంగా నిర్మించాల్సిన బాహ్య రహదారులు, రైల్వే మార్గం అలైన్‌మెంట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 12.5 కిలోమీటర్ల దక్షిణ దిశ బాహ్య రహదారి నిర్మాణానికి సంబంధించిన ఈఎస్‌పీ డ్రాయింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ బ్రేక్‌వాటర్‌కు సంబంధించి 950 మీటర్ల వేవ్‌వాల్ నిర్మాణాన్ని మూడు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. మూడు బెర్తులకు సంబంధించిన ఫిల్లింగ్ పనులను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. డ్రెడ్జింగ్‌కు సంబంధించి 13 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), పవర్ గ్రిడ్, గెయిల్ సంస్థలకు సంబంధించిన పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
మూలపేట పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారని కార్యదర్శి పేర్కొన్నారు. పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉప కలెక్టర్ వెంకట్రావు, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ, ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షక ఇంజనీర్ పద్మశ్రీ, ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందర్ రావు, ప్రాజెక్టు మానిటరింగ్ కన్సల్టెంట్ (పీఎంసీ) బృందం ప్రతినిధి అనిల్ కుమార్, పోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.