కె. గంగవరం పంచాయతీ పీఠం నాగేశ్వరరావుకే..!
కె. గంగవరం, మేజర్ న్యూస్:ఈ నెల 29న జరగనున్న స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కె గంగవరం గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.మంగళవారం గ్రామంలోని అన్ని సంఘాల ప్రతినిధులు పంచాయతీ ప్రెసిడెంట్‌గా పేరాబత్తుల నాగేశ్వరరావును ఎన్నుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ మద్దతు ప్రకటించారు.గ్రామ ఐక్యత,అభివృద్ధిని కాంక్షిస్తూ సంఘాలన్నీ ఒకే అభిప్రాయానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.