లోతుగెడ్డ ను అభినందించిన నేరడి నేతలు.
కొత్తూరు నవంబర్ 10(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండల దేశం నేత,జడ్పిటిసి యల్ శ్రీదేవి భర్త లోతుగెడ్డ తులసీ వర ప్రసాదరావు ను తన కార్యాలయం లో నీలకంఠపురం,నేరడి పంచాయితీ నాయకులు శాలువతో కప్పి సన్మానించారు.
మండలం లో అత్యధిక మెజార్టీ
తో జడ్పిటిసి గెలుపునకు కృషిచేసి మండల పార్టీ పేరు జిల్లా స్థాయిలో విన్పించారని వారన్నారు.ఈ సందర్బంగా తులసీ వర ప్రసాదరావు మాట్లాడుతూ ఇదే స్పూర్తి తో పనిచేసి త్వరలో జరబోయే పంచాయితీ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసి జిల్లా స్థాయిలో కొత్తూరు మండలం పేరు అగ్ర స్థానంలో నిలబెట్టాలని అన్నారు,లోతుగెడ్డ ను కలసిన వారిలో మాజీ సర్పంచ్ కొప్పర రామకృష్ణ ,గొంటి రమేష్ ,గురుగువెల్లి గోవిందరావు,జి భాస్కరరావు తదితరులు ఉన్నారు.