BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం

Select Suryaa Now
పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సత్కారం.

పలాస,నవంబర్ 10, మేజర్ న్యూస్.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పాలవలస పద్మావతి కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఘనంగా సన్మానించారు.విశాఖపట్నంలో గల పీవీఎన్ మాధవ్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసిన ఈ సమావేశంలో సన్మాన కార్యక్రమం జరిగింది.

జిల్లాలోనే తొలి బీజేపీ విజయం.

శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 9వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మొట్టమొదట విజయం సాధించిన ఘనత పాలవలస పద్మావతి దే.ఆమె భర్త,శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పాలవలస వైకుంఠ రావు తో కలిసి మాధవ్ ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్,పద్మావతి ని అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి ప్రకాష్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్,భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు బిర్లంగి ఉమామహేశ్వర రావు,జిల్లా ఉపాధ్యక్షులు పాలవలస వైకుంఠ రావు,పలాస నియోజకవర్గం పూర్వ కన్వీనర్ రామానంద స్వామిజీ,జిల్లా కార్యవర్గ సభ్యులు కంచరాన భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.