BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ

Select Suryaa Now
ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచి, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఏపీఓఎస్ఎస్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌పై డివైఈవో, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఏపీఓఎస్ఎస్ ఏఐ కోఆర్డినేటర్లతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులు, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను గుర్తించి, వారికి ఏపీఓఎస్ఎస్ ద్వారా తిరిగి విద్యను కొనసాగించే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. విద్యకు దూరమైన ప్రతి ఒక్కరికీ మళ్లీ చదువుకునే అవకాశం కల్పించడమే ఏపీఓఎస్ఎస్ ప్రధాన లక్ష్యంమన్నారు. అర్హులైన ప్రతి అభ్యర్థిని గుర్తించి చేర్పించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఏఐ కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా 100 శాతం సాధించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. చదువు మానేసిన, ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి ఏపీఓఎస్ఎస్ లో చేర్పించాలని, ప్రతి మండలంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టి, రోజువారీ పురోగతిని నివేదించాలని ఆదేశించారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్