BREAKING
బడ్జెట్ 2027: పీహెచ్‌డీసీసీఐ 5 ప్రధాన డిమాండ్లు వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జీవో నెం.15ను అమలు చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు రఫా సరిహద్దులో లూయిస్ హామిల్టన్: గాజా సహాయక పరిశీలన టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింతైన ఔట్.. అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా వెనుదిరిగిన కెప్టెన్! స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం

Select Suryaa Now
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం

 

కోహీర్ ; తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీ అమిత్ రాజ్ (అంజి) నియమితులయ్యారు. ఈ మేరకు మానకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అమిత్ రాజ్ చేస్తున్న నిరంతర కృషి, పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా అమిత్ రాజ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతను అప్పగించిన ఏఐసీసీ పెద్దలకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్‌ను మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ప్రతి గడపకు చేరవేస్తానని, ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని అమిత్ రాజ్ పేర్కొన్నారు.జహీరాబాద్ ప్రాంతానికి చెందిన నాయకుడికి రాష్ట్రస్థాయి పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.