కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మరిపెడ, మేజర్ న్యూస్, మరిపెడ మండలంలోని బూరహన్ పురం గ్రామంతో పాటు మరిపెడ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక పర్యటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన భూభారతీ లో భాగంగా బురహన్ పురం గ్రామంలో ఫీల్డ్ తనఖీ చేశారు. దరఖాస్తుదారులను కలెక్టర్ కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. మున్సిపాల టీ లో వివిధ రకాల పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు, సరైన అర్హత పత్రాలు లేకుండానే ఆన్లైన్ చేయడంపై మండిపడ్డారు.మున్సిపాలిటీ పరిధిలో 98శాతం మంది దరఖాస్తుదారుల పింఛన్ల మంజూరీకి అనుమతి ఇవ్వడంపై ఆశ్యర్యం వ్యక్తం చేశారు. దరఖాస్తులను మరోసారి పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనఖీ చేయాలని ఆదేశించారు.వారివెంట తహసీల్దార్ కృష్ణవేణి,మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వార్డు ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాద్ జిల్లా