BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం

Select Suryaa Now
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ బి. విజయ కుమార్ అన్నారు. 

రాష్ట్ర అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీలో మంగళవారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డైరెక్టర్ ఆధ్వర్యంలో అకాడమీ అధ్యాపకులు, సిబ్బంది, శిక్షణ అధికారులు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా నవంబర్ 10న రాష్ట్ర అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి. శ్రీనివాస్ 1991 నవంబర్ 10న కర్ణాటకలో విధి నిర్వహణలో ఉండగా హత్యకు గురయ్యారనీ , ఆయన స్మృతికి గుర్తుగా ఈ రోజున అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.అమరవీరుల స్ఫూర్తితో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు అంకితభావంతో పనిచేయాలని డైరెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రత, వృత్తి నైపుణ్యం, అప్రమత్తతకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న అధికారులు అమరవీరుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అకాడమీ అధ్యాపకులు, సిబ్బంది, ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.