మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : మంచిర్యాల పట్టణంలోని మొబైల్ షాపుల యజమానులు తమ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మొబైల్ షాపుల యజమానులు వివరించిన సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విన్నారు. వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మొబైల్ షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.