జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవచ్చే నెల 12న జరిగే జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రామచంద్రపురం 13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి బి. హెచ్. వి.లక్ష్మీ కుమారి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు
హాలులో న్యాయవాదులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ
రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్న కేసులుకు ప్రతి న్యాయవాది సహకారం అందించాలని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా లభించే ప్రయోజనాలు కక్షిదారులకు చెప్పి వారిని రాజీమార్గం వైపు నడిపించే బాధ్యత న్యాయవాదులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటిపల్లి లోవరాజు, ట్రెజరర్ సాధే నారాయణరావు, మహిళా ప్రతినిధి కె. వి. సత్యవాణి, న్యాయవాదులు పలివెల సత్యనారాయణ, దొమ్మలపాటి సత్యనారాయణ, గాలింకి చిట్టిబాబు, పిల్లా పృథ్వి రామయ్య, కటకం అబ్బురామ్,పి.భరత్ బాబు,పంపన విటల్,బొడ్డపాటి సురేష్ కుమార్,
ఎస్. బి. ఎస్ కుమారస్వామి,సూరంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు