BREAKING
సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. స్పాట్ చరమగీతం పాడినట్టేనా...! -పీజీ స్పాట్ ప్రవేశాలకు మొక్షమెప్పుడో... -మిగిలిన సీట్ల భర్తీకి ఐసెట్ తరహాలో అడ్మిషన్లను చేపడతారా...! జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం లోతుగెడ్డ ను అభినందించిన నేరడి నేతలు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు 8వ వేతన సంఘం: ఆటో రంగంలో భారీ వినియోగ చక్రం మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం తేజ డాక్టరేట్ ప్రదానం విమాన ఇంధనంలో విప్లవం: ఎస్ఏఎఫ్ కోసం కేంద్రం మెగా ప్లాన్ 14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

Select Suryaa Now
నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ; జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన *ఈడీఈఎన్ శుభమ్ ఈవీ  వాహనాల షోరూంను జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, శుభమ్ ఈవీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ఆసక్తి చూపాలని సూచించారు.ఈవీ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ వాహనాల ప్రయోజనాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని షోరూం నిర్వాహకులు గోపాల్, మచ్చేందర్, మనోహర్‌లకు సూచించారు.