BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Select Suryaa Now
తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరం అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం  సహాయ ఇంజినీర్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సమష్టి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బి.వి. గిరితో కలిసి జిల్లాలో ఆ శాఖ చేపడుతున్న పనులపై డీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను ఏఈలు నిరంతరం పర్యవేక్షించాలని, కేవలం మంజూరైన పనులకే పరిమితం కాకుండా మొత్తం తాగునీటి నిర్వహణపై బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోని నీటి ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయించాలని, క్లోరినేషన్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రైనేజీ లీకేజీలు, పైప్‌లైన్‌ సమస్యల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన పనుల్లో నిలిచిపోయిన వాటిని గుర్తించి, కాంట్రాక్టర్లతో మాట్లాడి రానున్న నెల రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తాగునీటి సరఫరా, శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతుల కల్పనపై ఎంపీడీవోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరిపాలనాపరమైన, నిధులపరమైన సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం మండలాల వారీగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.