BREAKING
జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం లోతుగెడ్డ ను అభినందించిన నేరడి నేతలు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు 8వ వేతన సంఘం: ఆటో రంగంలో భారీ వినియోగ చక్రం మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం తేజ డాక్టరేట్ ప్రదానం విమాన ఇంధనంలో విప్లవం: ఎస్ఏఎఫ్ కోసం కేంద్రం మెగా ప్లాన్ 14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ కె. గంగవరం పంచాయతీ పీఠం నాగేశ్వరరావుకే..! ఢిల్లీ యమునా రివర్ క్రూయిజ్: బుకింగ్ & రూట్ వివరాలు

కుందుర్పి మండలం లో చిరుత సంచారం.

Select Suryaa Now
కుందుర్పి మండలం లో చిరుత సంచారం.

కుందుర్పి: మండలంలోని బొమ్మజ్జిపల్లి, బి.కొత్తూరు, బసాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం వెలువడటంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రామాల సమీపంలోని వ్యవసాయ పొలాలు, పంట పొలాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికులు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాల వద్ద ఎక్కువ సమయం గడుపుతుండటంతో పాటు పశువుల కాపరులు పశువులను మేతకు తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో చిరుత సంచారం సమాచారం వారిని కలవరపెడుతోంది. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. పశువుల కొట్టాలను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. చిరుత కనిపించిన సందర్భంలో దాని దగ్గరకు వెళ్లడం, తరిమేందుకు ప్రయత్నించడం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు సమీపించడం వంటి చర్యలకు పాల్పడకూడదు. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. చిరుత సంచారం గురించి వస్తున్న సమాచారంపై అటవీశాఖ అధికారులు స్పందించి ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు తగిన చర్యలు చేపట్టి, చిరుత సంచారం నిజానిజాలను నిర్ధారించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.