విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్*
విజయనగరం మేజర్ న్యూస్
దత్తిరాజేరు మండలంలో ఈ స్థానిక ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కంచుకోటగా, వాటి పునాదులు బలంగా ఉన్న మండలంగా పేరున్న దత్తిరాజేరును 35 సంవత్సరాల తరువాత టీడీపీ కైవసం చేసుకుంది. ఇది సాధారణ విజయం కాదని, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహానికి దక్కిన ఘన విజయమని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకత్వంలో దత్తిరాజేరు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలను కూటమి గెలుచుకుంది. డైరెక్ట్ ఎన్నిక ద్వారా జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. ఎంపీపీ, జడ్పీటీసీ రెండు పదవులను ఒకేసారి టీడీపీకి కట్టబెట్టడం ఇదే తొలిసారి.
ఈ చారిత్రక విజయం వెనుక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం, నిరంతర పర్యవేక్షణే ప్రధాన కారణమని అధిష్టానం కూడా ప్రశంసిస్తోంది. మండలంలోని ప్రతి గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావించి, ప్రతి సమస్యను స్వయంగా తెలుసుకుని పరిష్కరించిన తీరు ఈ గెలుపుకు పునాది వేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం మండలంలో జరిగిన సుస్థిరమైన అభివృద్ధే. ఈ అభివృద్ధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామానికి రోడ్లు, కాలువలు, తాగునీరు, ఇంటింటికి కొళాయిలు వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించడమే ఈ గెలుపుకు తొలిమెట్టుగా నిలిచింది. ముఖ్యంగా రైతుల కోసం ఇరిగేషన్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. విద్యుత్ సమస్యలతో బాధపడుతున్న గ్రామాలకు కొత్త విద్యుత్ పోల్స్, లో వోల్టేజ్ ఉన్న గ్రామాలకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. స్థానిక భూ సమస్యల పరిష్కారం, పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్, రైతులకు అగ్రికల్చర్ బోర్ల ద్వారా పంటలకు నిరంతర నీరు అందించడం వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేని గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడమే ఈ గెలుపుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రాజుల రామచంద్రపురం, మారడం వంటి గ్రామాలకు టీడీపీ వెన్నుదన్నుగా నిలిచి వారి మనసులను గెలుచుకుంది. పాపయ్యవలస - శికారుగంజి గ్రామాల మధ్య రోడ్డు ఆ గ్రామ ప్రజల సుదీర్ఘ కల. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో ఆ రోడ్డు నిర్మాణం జరిగింది.
రాజుల రామచంద్రపురం నుంచి లింగరాజపురం, దత్తి నుంచి భోజరాజపురం, దత్తి నుంచి దత్తిరాజేరు వరకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరగని రోడ్లు నేడు జరిగాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. లెక్కల్లో చెప్పాలంటే మండలంలో మొత్తం 39.637 కి.మీ మేర 17 బీటీ రోడ్లకు రూ. 13 కోట్ల 56 లక్షల 20 వేలు మంజూరయ్యాయి. ఇందులో 13 పనులు పూర్తయ్యాయి. 3 పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్క పని మాత్రమే పురోగతిలో ఉంది.
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జేజేఎం నిధుల నుంచి రూ. 51 కోట్ల 1 లక్ష 48 వేలతో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కొళాయిలు వేసి తాగునీరు అందించారు. మొత్తంగా చూస్తే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభివృద్ధి వ్యూహం, ప్రజలతో మమేకమైన తీరు, కార్యకర్తలను ముందుండి నడిపించిన నాయకత్వమే దత్తిరాజేరులో టీడీపీకి చారిత్రక విజయాన్ని అందించిందని అధిష్టానం, కూటమి శ్రేణులు ప్రశంసిస్తున్నాయి.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం