BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

బిక్కవోలు జనసేనకు 100% విజయం

Select Suryaa Now
బిక్కవోలు జనసేనకు 100% విజయం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంబిక్కవోలు మండలంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మండల పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరూ విజయం సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ఐదు స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులే గెలుపొందడం విశేషం. విజయం సాధించిన వారిలో కాపవరంలో కొట్టు వీరలక్ష్మి, కొమరిపాలెం–1లో కొల్లి వెంకటలక్ష్మి, బలభద్రపురం–3లో ధనకొండ లక్ష్మి, బిక్కవోలు–2లో పాలికి బేబీ, మెల్లూరులో ముమ్మిడి సత్యశ్రీ ఉన్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ విజయానికి పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, ఇందల వీరబాబు, గోవిందరాజు, కొండబాబు, సతీష్‌కుమార్, వెంకన్నబాబు, అరుణ్‌కుమార్, హరీష్, శ్రీనివాసు తదితరులు కృషి చేశారు. ఐదు స్థానాల్లోనూ విజయం సాధించడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.