ఉపాధి హామీ పనికి శ్రీకారం.
వట్టిపల్లి ,; మండలంలోని నిర్జెపుల గ్రామ శివారులో మంగళవారం నాడు ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టినారు .గ్రామ సర్పంచ్ మోహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది.వి వీరారెడ్డి మాట్లాడుతూ !ఉపాధి హామీ పథకం పేదలకు వరం లాంటిది అన్నారు. వలసలు వెళ్లే బదులు మన గ్రామంలో మనం పనిచేసి, ఇటు గ్రామ అభివృద్ధి, అటు పేదలకు ఉపాధి లభించడం ,సమాజ అభివృద్ధికి ఎంతో లాభం అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, కార్యదర్శి సుశీల, వి వీరారెడ్డి, గోపాల్, రాజు, నరేందర్, రెడ్డి ,వార్డు సభ్యులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.