నగర అభివృద్ధికి అండగా ఉంటాం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన 60, 53వ డివిజన్ కార్పొరేటర్లు తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 60వ డివిజన్ కార్పొరేటర్ ఆదం సుధాకర్ రెడ్డి, 53వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తుడా చైర్మన్ ను వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తుడా చైర్మన్ మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధిని చూసి నగరపాలక సంస్థలో ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం తో పాటు తిరుపతి నగర అభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్