BREAKING
వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జీవో నెం.15ను అమలు చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు రఫా సరిహద్దులో లూయిస్ హామిల్టన్: గాజా సహాయక పరిశీలన టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింతైన ఔట్.. అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా వెనుదిరిగిన కెప్టెన్! స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన!

దీపావళి వేళ జూదరులపై పోలీసుల మెరుపు దాడులు..

Select Suryaa Now
దీపావళి వేళ జూదరులపై పోలీసుల మెరుపు దాడులు..

సూర్య, నాగిరెడ్డి పేట్, దీపావళి పండుగ వేళ పేకాట ఆడుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నాగిరెడ్డి పేట ఎస్సై అగస్త్య భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో దీపావళి వేళ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, గత మూడు రోజుల వ్యవధిలో నాలుగు చోట్ల వరుసగా మెరుపు దాడులు నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 22 మంది పేకాటరాళ్లను పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.37,282 నగదు, 12 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని గోపాల్ పేట గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని రూ.1,572 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాండూర్ గ్రామంలో అంజయ్య ఇంట్లో పేకాట ఆడుతున్న మరో నలుగురిని పట్టుకొని రూ.8,520 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా జలాల్‌పూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకొని రూ.15,050 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. టేకుల చెరువు తండా శివారులో నిర్వహించిన నాలుగో దాడిలో ఎనిమిది మందిని పట్టుకొని రూ.12,140 నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.