BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం సుమయా రెడ్డి ‘ప్రొడక్షన్ నెం. 2’ షురూ: డిఫరెంట్ జానర్‌లో మహారాణిలా పోస్టర్ లుక్ వత్సవాయి జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

నవాబుపేట సూర్య న్యూస్: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయరాం నాయక్,తహసీల్దార్ సురేష్ పేర్కొన్నారు.మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి చక్కటి వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.భూ సమస్యలు,రెవెన్యూ అంశాలు,గ్రామీణాభివృద్ధి,ప్రభుత్వ సంక్షేమ పథకాలు,ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేయవచ్చని జయరాం నాయక్ పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా వివరిస్తూ అవసరమైన ఆధారాలతో వినతులు సమర్పించాలని ఆయన అన్నారు.ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒకే ఒక్క వినతిపత్రం అందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.