పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం
సూర్య కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి గత 20 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న కరీంనగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఎస్‌కే. సిరాజ్ హుస్సేన్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించారు. పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తదితర బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గ టీపీసీసీ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. పార్టీ ఉద్యమాలు, ఎన్నికల ప్రచారాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విధానాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.