BREAKING
ఏళ్ల నాటి సొంతింటి కళ సాకారం..! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో మాంసపరిశ్రమను బలోపేతం చేసే దిశగా టైసన్ ఫుడ్స్ కీలక నిర్ణయం కెనడా సావరిన్ వెల్త్ ఫండ్‌ కొత్త చీఫ్‌గా కారెన్ కర్నియోల్-టాంబూర్ బొల్లారం డివిజన్ లో కోర్ కమిటీ సమావేశం కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణకు చెక్ రిపబ్లిక్ కీలక అడుగు ఖాళీ పోస్టులు భర్తీ చేయండి ఎఫ్‌డీఏ ఓజెంపిక్, జెప్‌బౌండ్ మందులపై కొత్త కంటి ప్రమాద హెచ్చరికలు కోయలపాడు గ్రామంలో భూ రీసర్వే గ్రామసభ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ జనసేన నాయకులు నవీన్ నిశ్చల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ వెంకట సాయి ప్రజావాణికి మూడు దరఖాస్తులు.. అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు....

పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆపదలో అండగా ప్రేమ్ సాగర్ రావు!

Select Suryaa Now
పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆపదలో అండగా ప్రేమ్ సాగర్ రావు!

• రూ.1.23 కోట్లకు పైగా సంక్షేమ సాయం పంపిణీ!

• అర్హుల చెంతకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు..

• పేదల పక్షాన ప్రజా ప్రభుత్వం.. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ!

 

లక్షెట్టిపేట, సూర్య:

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF), కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 157 మంది లబ్ధిదారులకు రూ.56,56,150 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 67 మంది లబ్ధిదారులకు రూ.67,07,772 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 3,388 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 3,850 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని, ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్లు చల్లా నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.