ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ తోటా దేవి ప్రసన్న అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరియు జ్యోతి వృద్ధాశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపి కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా డీసీసీ తోటా దేవి ప్రసన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం ఆయురారోగ్యాలతో సంతోషంగా చిరకాలం కొనసాగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీత రాములు, డీసీసీ కమిటీ సభ్యులు ప్రసాద్ పెదబాబు, మంద హనుమంతు, కొడుమురి శ్రీనివాసరావు, జానీ భాష, బట్టు మురళి, పైడా రాజేంద్ర ప్రసాద్, బాలు నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, పాల సత్యనారాయణ రెడ్డి, కొత్వాల శ్రీనివాస రావు, మండే వీర హనుమంతు, మండల కమిటీ పరమేష్ యాదవ్, దేవరగడ్ల ప్రసాద్, నూకల రంగారావు, భువన సుందర్ రెడ్డి, అజయ్ కుమార్, జేమ్స్ సునీల్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దెల రమేష్, ఐఎన్టీయూసీ రజాక్, కాపర్తి వెంకటాచారి మరియు కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.