యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్టగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోససారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు రోషన్ మేక హీరోగా ఒక మైథలాజికల్ ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జటాయు అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినిమా పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం సాధారణ ప్రేమకథలు లేదా కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా, వినూత్నమైన ఆలోచనలతో ప్రేక్షకులను అలరించే ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు తెరలేపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మైథలాజికల్ ఫాంటసీ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. గతంలో ఈ కథను వేరే యువ హీరోతో తెరకెక్కించాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి మంచి ఊపుమీదున్న రోషన్ మేకను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ గత రెండు సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్‌పైనే ప్రత్యేకంగా కసరత్తు చేస్తూ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. పౌరాణిక అంశాలకు ఆధునిక జోడించి విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లాస్ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు, సరికొత్త యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇంద్రగంటి మోహనకృష్ణ మార్క్ మేకింగ్ స్టైల్ తో పాటు, రోషన్ మేక నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది. భిన్నమైన జానర్‌తో రానున్న ఈ మైథలాజికల్ ఫాంటసీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read: టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సృష్టించిన జింబాబ్వే వెటరన్ బ్యాటర్ క్రైగ్ ఎర్విన్