మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు
ఆమనగల్లు రంగారెడ్డి:
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన మెగా రైతు మేళ ఆగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్ పో 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న రైతు మేళాకు ఆమనగల్లు మండలం నుండి రైతులు, మహిళా సంఘం సభ్యులు భారీగా తరలి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన మేళా కు మండలంలోని 250 మంది రైతులు, మహిళా సంఘాల సభ్యులు తరలి వెళ్లేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తరలించారు. సదస్సుకు తరలి వెళ్లే బస్సుల శ్రేణిని ఆమనగల్లులో అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ డి ఏ శోభారాణి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, యాంత్రికరణ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలను, సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధునిక పద్ధతులు తెలుసుకుంటే రైతులు లాభాలు పొందగలరని మేలా ద్వారా యంత్రాలు, విత్తనాలు, ఎరువుల వినియోగంపై రైతులకు పూర్తి అవగాహన వస్తుందని ఆమె చెప్పారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని తమ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం విజయ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఏపీఎం నీరజ, ఏ ఈ ఓ లు నికిత, మీనాక్షి, ప్రభావతి, భూదేవి, ఐకెపి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.