డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా రోమాల సాయిలు
పెద్దశంకరంపేట ; మెదక్ జిల్లా డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెద్దశంకరంపేట మండలం కోళాపల్లి సర్పంచ్ రోమాల సాయిలు ఎన్నికయ్యారు. ఈ మేరకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా అధ్యక్షుడు మహేందర్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రాన్ని అందుకున్నారు. తనను జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా నియమించిందుకు కృషి చేసిన ఎంపీ సురేష్ షెట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డిలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.