BREAKING
నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని రైతులు పంట నష్టాల నమోదు చేయించుకోవాలి వ్యవసాయ శాఖ అధికారి కమల్ రాజ్ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌కు దళిత నాయకుల సత్కారం కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా ఆకాశ దీపం ఏర్పాటు గాజుల అలంకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి

తూప్రాన్ తాళం వేసిన ఇంట్లో చోరీ –

Select Suryaa Now
తూప్రాన్ తాళం వేసిన ఇంట్లో చోరీ –

తూప్రాన్: ;  తూప్రాన్ పట్టణానికి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువాను కూడా పగలగొట్టి అందులో దాచిన సుమారు ఐదు తులాల వెండి చైన్, పావు తులం బంగారు ఆభరణం మరియు కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు.ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని ఎస్సై గంగరాజు  దర్యాప్తు చేపట్టారు.ప్రజలకు పోలీసుల సూచన: ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే నమ్మకమైన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఎస్సై గంగరాజు తెలిపారు,